పవిత్ర గంగానది ఒడ్డున కూర్చుని నిత్యహారతి చూడటం ఒక అద్భుత అనుభవం. ఆమె రోజూ ఆ సమయానికి అక్కడికొస్తుంది. నిత్యహారతి వైభవం వీక్షిస్తుంది. ఆమె కళ్ళు ఇంకా దేనికోసమో, ఎవరికోసమో వెదకులాడుతూ ఉంటాయి. ఆ రోజు అతడుకూడా ఆమెకోసమే కాచుకుని ఉన్నాడు. ఆమెతో ఏదో చెప్పాలని అతడి తపన. ఇంతకూ ఆమె వెదకులాట దేనికి? అతడు చెప్పాలనుకుంటున్నదేమిటి?

సర్వపాపాలను ప్రక్షాళన చేసే దేవతాస్వరూపిణి, నిరంతర ప్రవాహ తరంగిణి గంగ. ఆ పవిత్ర గంగ ఒడ్డున కూర్చుని, సాయంకాలవేళ జరిగే నిత్యహారతిని చూడటానికివచ్చే మహా జనసందోహంతో ఉజ్వలమైన దీపహారతుల వెలుగులు, గంగలో తళుక్కుమని మెరుస్తుంటే ఆ దృశ్యం చూడటం ఒక అద్భుతమైన అనుభవం. ఘంటానాదంతో శంఖం పూరిస్తూ, శ్లోకాలు పఠిస్తూ లయుబద్ధంగా పూజారులు హారతి ఇస్తూ ఉంటే అవి అందుకుంటూ శివపార్వతులు అక్కడ ఆనందతాండవం చేస్తున్నట్లనిపిస్తుంది.కాని ఈ అలౌకికమైన ఆనందాన్ని ఘాట్‌ మెట్లవీుద కూర్చుని ఉన్న అన్నపూర్ణ మాత్రం పూర్తిగా అనుభవించటంలేదు. ఆమె కళ్ళు, మనసు దేనికోసవెూ అన్వేషిస్తూ ఉన్నాయి. ఇలా ప్రతిరోజు జరుగుతుంది.

ఘాట్‌కి వస్తుంది, హారతి అయ్యేవరకు ఉండి వెళ్ళిపోతుంది. కానీ ఆవెు వచ్చేది పూర్తిగా హారతి చూడటంకోసం మాత్రం కాదు. ‘‘అన్నపూర్ణగారు రండి రండి రండి, అప్పుడే రాత్రి తొమ్మిది అయింది’’ అని చెప్పి హెచ్చరించాడు ఆశ్రమంలో ఉండే తనతోపాటు ఉండే రముణ అనే కుర్రాడు. అతను కూడా ఈవెులాగే బతుకుతెరువు కోసం తెలుగుదేశం వదిలి కాశీకి వచ్చాడు.‘‘ఆ వస్తున్నా! పద పద’’ అంటూ లేచింది.‘‘వీురు ఎందుకండీ రోజూ వస్తారు హారతి చూడటానికి, వీుకు విసుగు అనిపించదా ఈ జనం, ఈ హడావిడి’’ అన్నాడు రమణ.

‘‘లేదు రమణా, ఎన్నిసార్లు చూసినా తనివితీరదు’’ (మనసులో మాత్రం అతను కనిపించేవరకు రాక తప్పదు అనుకుంది) అంటూ ఆ విశ్వనాథుడికి, గంగమ్మతల్లికి నమస్కారం చేసుకుని ఇరుకు సందులుగుండా, గోమయం తొక్కకుండా జాగ్రత్తగా అడుగులువేస్తూ ఆశ్రమందారి పట్టారు ఇద్దరూ.ఆశ్రమానికి చేరుకున్నాక, వంటశాలలోకి వెళ్ళి, ఫలహారం కానిచ్చుకుని మరుసటిరోజు భోజనసదుపాయం ఎంతమందికి చెయ్యాలో లెక్కచూసుకుని దానిప్రకారం అన్నీ ఏర్పాటు చేసుకుంది. ఉదయమే త్వరగా లేవాలి అనుకుంటూ నిద్రకుపక్రవిుంచింది.