మేషంఅశ్విని, భరణి,కృత్తిక 1వ పాదంఈ వారం సంప్రదింపులకు అనుకూలం. ఆచితూచి వ్యవహరించాలి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. పెద్దల సలహా తీసుకోండి. ఎదుటివారి ఆంతర్యం అవగతమవుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. రుణ ఒత్తిళ్లు వేధిస్తాయి. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఇంటి విషయాలపై శ్రద్థ వహిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది.================వృషభంకృత్తిక 2,3,4; రోహిణి,మృగశిర 1,2 పాదాలుమీ శ్రమ ఫలిస్తుంది. ఎంతటి వారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. ప్రతిభాపాట వాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. సోమ, మంగళవారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. పిల్లల చదువులపై దృష్టి పెడతారు.=========================మిథునంమృగశిర 3,4; ఆర్ద్ర,పునర్వసు 1,2,3 పాదాలుఓర్పు, పట్టుదలతో శ్రమిేస్త విజయం తధ్యం. ఆశావహదృక్పథంతో అడుగు వేయండి. సాయం ఆశించవద్దు. స్వయంకృషి తోనే లక్ష్యాన్ని సాధిస్తారు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆది, సోమవారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. నిలిపివేసిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు.========================కర్కాటకంపునర్వసు 4వపాదం, పుష్యమి, ఆశ్లేషఆర్థికస్థితి సామాన్యం. ఆలో చనలు నిలకడగా ఉండవు. గృహంలో స్తబ్థత నెలకొంటుంది. ఊహించని ఖర్చులు, ధరలు ఆందోళన కలిగిస్తాయి. ఈ చికాకులు తాత్కా లికమే. పరిస్థితులు క్రమంగా మెరుగుపడ తాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఆరోగ్యం సంతృప్తికరం. బుధ, గురువారాల్లో కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలు న్నాయి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది.============================సింహంమఖ, పుబ్బ,ఉత్తర 1వ పాదంఅనుకూలతలు అంతంత మాత్రమే. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆత్మీయుల కలయిక ఉత్తేజాన్నిస్తుంది. గృహమార్పు అనివార్యం. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. శుక్ర, శనివారాల్లో అపరిచితులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. పిల్లల విషయంలో శుభఫలితాలు న్నాయి. అతిగా శ్రమించవద్దు. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.