ఐటెమ్‌బాక్స్‌దాసదాసీజనంతో కూడిన వైభోగ జీవితం కావాలని ఆశించేది ఆమె. అందుకు సాధువులనే నమ్ముకుంది. ఒకరోజు మహిమగల సాధువు ఆమెకు వరం ఇచ్చాడు. కన్నబిడ్డను ఏడిపిస్తే ఆమె నోటివెంట ముత్యం రాలుతుందన్నాడు. అప్పటినుండి ఆ బిడ్డను కొట్టి ఏడిపించి ముత్యాలు సంపాదించింది ఆ తల్లి. ఆమె సంపద పెరిగింది. కానీ అంతలోనే ఆమెకు కొత్త సమస్యలొచ్చాయి. ఏమిటవి?=============నూరుకట్ల పిశాచం కథలుః 2ఏడిస్తే ముత్యంరచనః వసుంధరఅనగాఅనగా ఒక ఊళ్లో సోమయ్య అనే సామాన్య గృహస్తుడు ఉండేవాడు. అతడికి భుక్తికి లోటు లేదు. కానీ అతడి భార్య సీతమ్మకి దురాశ ఎక్కువ. ఉన్న ఇంటిని మేడగా మార్చాలనీ, దాసదాసీజనంతో అంగరంగ వైభోగ జీవితం గడపాలనీ అనుకునేది. భర్త ఎంత కష్టపడి సంపాదించినా తిండికీ, ఇతర అవసరాలకే సరిపోయేదితప్ప, సీతమ్మ కలలు నిజం కావడానికి ఆ డబ్బు సరిపోయేది కాదు. అందుకని సాధువుల్నే నమ్ముకుంది సీతమ్మ. ఊళ్లోకి వచ్చిన ప్రతి సాధువునూ ఇంటికి ఆహ్వానించి మర్యాదలుచేసి పంపేది. కొన్నాళ్లకి ఆమె అదృష్టం పండి, నిజంగానే మహిమగల ఓ సాధువు ఆమె ఇంటికొచ్చాడు. ఆమె చేసిన మర్యాదలకు, శుశ్రూషలకు సాధువు సంతోషించి, ఏదైనా కోరుకోమన్నాడు. వెంటనే ఆమె- భోగభాగ్యాలతో తులతూగే జీవితం కావాలంది. ‘‘డబ్బులో సుఖం ఉందనుకోకు. నీ కుటుంబానికి సుఖసంతోషాలు కోరుకో. ఎక్కువ మేలు జరుగుతుంది’’ అని సాధువు సలహా ఇచ్చాడు. కానీ సీతమ్మ తనకి డబ్బే కావాలని పట్టుబట్టింది. అప్పుడు సాధువు సీతమ్మ పన్నెండేళ్ళ కూతురు చంద్రముఖిని దగ్గరగా రమ్మన్నాడు.చంద్రముఖి దగ్గరకు రాగానే సాధువు ఆమె తల నిమిరి, 'ఈ రోజునుంచీ ఈమె సంతోషం అన్నది మరిచిపోయి, విచారంగా ఉంటుంది. పోయిన ఆ సంతోషం రోజుకొక ముత్యమై- ఆమె భోరున ఏడ్చినపుడు నోటినుంచి రాలుతుంది. ముత్యాల కోసం, కూతుర్ని ఏడిపిస్తావో, లేక ప్రేమతో ఆమెను సంతోషంగా ఉంచుతావో నీ ఇష్టం’’ అని సీతమ్మతో అన్నాడు.‘‘ఏడిస్తే ముత్యం వస్తుంటే, దాన్ని సంతోషంగా ఉంచడం ఎందుకు స్వామీ!’’ అంది సీతమ్మ ఆశ్చర్యంగా.