పచ్చనాకుల కవిత్వం 

తొలినాళ్లనుంచి కవిత్వపు పొలంలో ‘ధాన్యపు గింజలు’ పండిస్తున్న దర్భశయనం శ్రీనివాసాచార్య 36 కవితల తాజా సంపుటిలో కూడా... పత్రహరితంలాంటి కవిత్వమే పరుచు కుంది. అంతేకాదు ‘ఇవాళ్టి మనిషినే కాదు, రేపటి మనిషినీ ఇవాళే తగల బెడుతున్నామని’’ హెచ్చరిస్తుంది. తెలంగాణ గురించి చెప్తూ ‘తప్పనపుడు ఇంకా అన్నాన్నైనా వొదులుకుంటుంది కానీ ఆయుధాన్ని కాదు’ అంటాడు కవి. సేద్యం చుట్టూ తిరిగే ఈ కవిత్వం నిండా మనిషి, పొలం, పోరాటమే నిండి ఉంది. ‘వాళ్ళు నిలబడ్డారు’, ‘పంటను తగులబెట్టకు తండ్రీ’లాంటి కవితలు నిలువెల్లా కది లిస్తాయి. ప్రతి వాక్యం చిగురువంటి మృదుత్వంతో రైతులాగా ఆకర్షిస్తుంది. 

- డా. వెల్దండి శ్రీధర్‌

ధాన్యం గింజలు (కవిత్వం)

 రచన: దర్భశయనం శ్రీనివాసాచార్య 

పేజీలు: 87, వెల: రూ. 80, 

ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు