బడుగుల వెతలు

వెలుగుజిలుగుల మెట్రోపాలిటన్‌ నగరం మరో పార్శ్వపు నీలినీడలివి. హైదరాబాద్‌లోని పాతబస్తీ మురికివాడల్లో తిరిగి, దారిద్య్ర రేఖకు దిగువస్థాయి ప్రజల సాధకబాధకాలు ఆర్తిగా ఆలకించి, మౌఖిక గాథలుగా అక్షరబద్ధం చేశారు కవిని. పచ్చబొట్లు వేసే వారు, ఇత్తడి సామాన్లు అమ్మేవారు, వీరముష్టివారు, కాన్పులు చేసేవారు, బీడీలు చుట్టేవారు... ఇలా విభిన్న వృత్తుల సంగమం పాతబస్తీ. యాదమ్మ,ఉన్నీసా, రంగమ్మ, ఫర్జానా, సత్తెమ్మ, హమీదా.. వందలాది మంది. ఎవరిని కదిలించినా దూకే కడగండ్లు. ముందుమాటలో పాశం యాదగిరి అన్నట్టు నిజానికిలాంటి ఇంటర్వ్యూలు చేయడం ఏటికి ఎదురీదడమే. కవిని ఆలూరిని అభినందించకుండా ఉండలేం.

- తహిరో

మూసీ నది మాట్లాడితే...! (మౌఖిక గాథలు),

రచన: కవిని ఆలూరి

పేజీలు: 196, వెల: రూ. 150,

ప్రతులకు: 97016 05623