కాలం కత్తుల వంతెనపై

‘‘సలాం హైదరాబాద్‌’’ నవలకు కొనసాగింపుగా వచ్చిన పుస్తకమిది. స్వామి అనే పాత్ర తన కథను చెబుతూ తను పుట్టి పెరిగిన హైదరాబాద్‌ గురించి కూడా చెప్పే చరిత్ర ఇది. నవల మొత్తం స్వగతమే అయినా 1970 నుండి 1990 వరకు దేశంలో జరిగిన ముఖ్య ఘట్టాలను కళ్లకు కట్టారు. ఎమర్జెన్సీ, ఎన్నికలు, జనతా ప్రభుత్వం ఏర్పాటు, ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి రావడం, స్వర్ణదేవాలయంపై సాగిన ఆపరేషన్‌ బ్లూస్టార్‌, ఇందిరా గాంధీ హత్య, ప్రతీకారంగా సిక్కుల ఊచకోత... లాంటి ఘట్టాలను విశదపరుస్తూ సాగుతుంది రచన. నేటి తరానికి తెలియని ఎన్నెన్నో చారిత్రక మలుపులను... ఆసక్తికరంగా, సులభశైలిలో రాశారు.

- కమల్‌

కల్లోల కలల కాలం,

రచన: పరవస్తు లోకేశ్వర్‌

పేజీలు: 523, వెల: రూ.350,

ప్రతులకు: 0866-2436642/4