విభిన్న వస్తువైవిధ్యం

‘మా కథలు 2018’ సమాహారంలో ఎన్నదగినవి ఎన్నో ఉన్నాయి. కడయింటి కృష్ణమూర్తి ‘అనురాగ సీమ’లో కనిపించిన ఆత్మీయస్పర్శ అమృతం కురిపించింది. ఆర్థిక మోసాల వింత విలాసం... తిరుమలశ్రీ ‘అప్పు చేసి చూడు...!’లో విశ్వరూపమై దర్శనమిచ్చింది. దాంపత్యంలో అన్ని సమస్యలకూ సర్దుకుపోవడమే దివ్యమైన ఔషధం... అని చాటిచెప్పిన కె.బి.కృష్ణ ‘అంతా మనలోనే ఉంది...’ జీవనమాధుర్యాన్ని చవిచూపించింది. ఓ జాలరి ఇల్లాలి గుండె చప్పుడైన దాట్ల దేవదానం రాజు ‘కిటికీలోంచి గోదారి’. అలాగే గన్నవరపు నరసింహమూర్తి ‘లోలకం’... తరచిచూస్తే డా. ఆలూరి విజయలక్ష్మి ‘దిశ’, పి.చంద్రశేఖర అజాద్‌ ‘ప్రతిరూపాలు’, పాణ్యం దత్తశర్మ ‘మా పెద్దక్కయ్య’ బాగా గుర్తుండిపోయే కథలు.

- జి.వి.ఎస్‌.మూర్తి

మా కథలు 2018,

సంకలనకర్త : సిహెచ్‌. శివరామప్రసాద్‌

పేజీలు: 306, వెల: రూ.99, 

ప్రతులకు:ప్రముఖ పుస్తక కేంద్రాలు