చేతిలో రెవెన్యూ చిట్టా

ప్రభుత్వానికీ... ప్రజలకూ మధ్య వారధి రెవెన్యూ శాఖ. మన పుట్టుక, కులం, ఆస్తి, చావు... వేటిని చట్టబద్ధం చేయాలన్నా ఆ శాఖ ఆమోదం ఉండాల్సిందే. సామాన్యుడి పాలిట సృష్టిస్థితిలయ కారులు రెవెన్యూ అధికారులు. కానీ ఈ శాఖ గురించి ప్రజలు ఎందుకంత భయపడుతుంటారు? అంత ప్రభావం ఉన్న అధికారులేమన్నా తృప్తిగా ఉన్నారా? వంటి ప్రశ్నలకు జవాబుగా నిలుస్తుందీ పుస్తకం. లోపం ఎక్కడ ఉందో చర్చిస్తూనే... రెవెన్యూ వ్యవస్థ చరిత్ర, విధివిధానాల గురించి విలువైన సమాచారాన్ని అందిస్తుంది.

 

తెలుగు రాష్ట్రాల రెవెన్యూ వ్యవస్థ నిన్న నేడు రేపు

రచన: ఏనుగు నరసింహారెడ్డి,

పేజీలు: 125, వెల: రూ.130

ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు