వెంగళరావునగర్‌, నవంబర్‌ 11 (ఆంధ్రజ్యోతి): బాలల దినోత్సవం సందర్భంగా బాలల చిత్ర విభాగంలో నంది అవార్డు గెలుచుకున్న ‘హాలీడే.. జాలీ డే’ ఆంగ్ల చిత్రం ఉచిత ప్రదర్శన ఈ నెల 14న మధురానగర్‌లోని సాగిరామకృష్ణంరాజు కమ్యూనిటీహాల్‌లో ప్రదర్శించనున్నారు. చిత్ర నిర్మాత కే రవి ప్రకాష్‌ చిత్రప్రదర్శనకు ముందుకు వచ్చారని మధురానగర్‌ సంక్షేమ సమితి ప్రధాన కార్యదర్శి కోడె సాంబశివరావు తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రదర్శనతో పాటు ప్రముఖ మెజీషియన్‌ కొండా యాదగిరి మ్యాజిక్‌ ప్రదర్శన ఉంటుందన్నారు. కాలనీలోని బాల బాలికలు,  పరిసర ప్రాంతాల్లోని పాఠశాలల విద్యార్థులు తిలకించవచ్చునని తెలిపారు.