ముస్లిం అస్తిత్వవాదానికి పెద్ద పీట వేసిన రాహత్‌కు మతాలకతీతంగా అసాధారణమైన ఆదరణ ఉంది. ఉర్దూలో ‘రాహత్‌’ అంటే ఊరట అని అర్థం. పేరుకు తగ్గట్లుగానే అనేక సమస్యలతో సతమతమయ్యేవారికి ఆయన షాయిరీ సాంత్వన కలిగిస్తుంది.

‘‘మై అప్నీ లాష్‌ లియే ఫిర్‌ రహా హూఁ కాంధే పర్‌యహాఁ జమీన్‌ కీ కీమత్‌ బహుత్‌ జ్యాదా హై’’

(నేను నా శవాన్ని భుజాలకెత్తుకుని తిరుగుతున్నాఇక్కడ భూమి రేటు చాలాచాలా ఎక్కువ)ఆయనో గజల్‌ ఝురి. తన షాయిరీతో జలపాతాలను నిలువరిస్తాడు. సూర్యుడితో సంభాషిస్తాడు. కన్నుగీటి జాబిలిని ఆకాశం నుంచి డాబా మీదికి దింపుతాడు. ప్రియు రాలి కౌగిలిలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గజల్‌కు బంధనాలు తెంచేసి స్వేచ్ఛనిస్తాడు. షాయిరీ రసజ్ఞులను కాల్పనిక ప్రపంచం నుంచి వాస్తవంలోకి తీసుకొస్తాడు. జీవితంలోని చేదు నిజాలకు పర్దా తొలగిస్తాడు. దైవం, మతం, మత కలహాలు, మానవత్వం, రాజకీయాలు, దేశభక్తి, కపటత్వం, చట్టం, న్యాయం, వివక్ష, ముస్లింలు, ఉగ్రవాదం... ఇలా అన్నింటి పైనా గజళ్లు రాసి ఉర్దూ షాయిరీలో తనకంటూ భారత్‌లోనే కాకుండా విదేశాలలో సైతం విశిష్ట స్థానం సంపాదించుకున్నాడు. ఆయనే ప్రముఖ ఉర్దూ షాయర్‌ రాహత్‌ ఇందోరీ. గత 50ఏళ్లుగా అసంఖ్యాకమైన ముషా యిరాలలో తన కవితను వినిపించిన రాహత్‌... గజల్‌కు కొత్త వన్నెలద్దాడు. ఆయన ముషాయిరా వేదికపై ఉంటే అర్ధరాత్రి కాదు... తెల్లవారుజాముదాకా కూడా నిద్ర కాచేం దుకు సిద్ధపడే ఆహాతులు కోకొల్లలు. ముస్లిం అస్తిత్వవాదా నికి పెద్దపీట వేసిన రాహత్‌కు మతాలకతీతంగా అసాధారణ మైన ఆదరణ ఉంది. ఉర్దూలో ‘రాహత్‌’ అంటే ఊరట అని అర్థం.

 

పేరుకు తగ్గట్లుగానే అనేక సమస్యలతో సతమతమ య్యేవారికి ఆయన షాయిరీ సాంత్వన కలిగిస్తుంది.మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌లో 70ఏళ్ల క్రితం పుట్టిన రాహత్‌ అసలు పేరు రాహత్‌ కురేషీ. ఆయన గొప్ప కవేకాదు అద్భుతమైన పెయింటర్‌, బాలీవుడ్‌లో ప్రముఖ గీత రచయిత కూడా. గజల్‌, నజ్మ్‌, రుబాయీలు రాయడం ఒక ఎత్తయితే ముషాయిరాలలో వాటిని ఆహాతుల మనసుకు హత్తుకు నేలా శక్తిమంతంగా చెప్పగలగడం చాలా ముఖ్యం. ఈ కళలో ఆయన పండిపోయారు. ఇందోర్‌ యూనివర్సిటీలో రాహత్‌ 30 ఏళ్లపాటు విద్యార్థులకు ఉర్దూ సాహిత్యాన్ని, షాయిరీని బోధించారు. గజల్‌ను, నజ్మ్‌ను ఎలా చదవాలి? ఎలా అధ్యయనం చేయాలి? ఎలా బోధించాలి? వాటిలోని ప్రతీకాత్మక భావనలను, గాఢతను, నిగూఢతను ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటి విషయాలన్నీ ఆయనకు కరతలా మలకం. అందుకే ఆయన ముషాయిరా వేదికలపై అంతే ఉత్సాహంగా గజల్‌ వినిపించి ఆహూతులను మంత్రముగ్ధుల్ని చేస్తారు. దశాబ్దాల తరబడి షాయిరీ రాస్తున్నా ప్రాసంగి కతను కోల్పోని అరుదైన షాయర్‌ ఆయన. ఎందుకంటే ఏళ్ల క్రితం రాసిన గజళ్లు కూడా ప్రస్తుత వాతావరణానికి అద్దం పడతాయి. రాహత్‌ తన కవితా ప్రస్థానంలో ప్రభు త్వాలు, రాజకీయ నాయకులు, కోర్టులు, మీడియా ఎవర్నీ ఖాతరీ చేయలేదు. మన దేశంలో ఎన్నికలు వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఈ షేర్‌లో చెప్పారు:‘‘సరహదోం పర్‌ బహుత్‌ తనావ్‌ హై క్యా?