సినీ గేయరచయితగా రాణిస్తున్న బాపు

కోల్‌బెల్ట్‌ నుంచి చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర
ఇప్పటికి 300కు పైగా పాటలతో గుర్తింపు

మందమర్రి, మంచిర్యాల/అదిలాబాద్:  సినీరంగంలో అవకాశాలు మామూలు విషయం కాదు. ఎంతో ప్రతిభ ఉంటే తప్ప రాణించే పరిస్థితి లేదు. అలాంటిది పాటల రచయితగా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఇప్పటికి 300కు పైగా పాటలు రాశారాయన. పట్టుదల ఉంటే సినిమాల్లో రాణించడం పెద్ద కష్టం కాదని చాటిచెబుతూ, ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు జిల్లాకు చెందిన యువ సినీగేయ రచయిత తైదల బాపు. 
 
మంచిర్యాల జిల్లా తాండూర్‌ మం డలం మాదారం గ్రామానికి చెందిన తైదల బాపు గేయరచయితగా రాణిస్తున్నారు. సింగరేణి కార్మిక కుటుంబానికి చెందిన ఈ యన, విద్యార్థి దశ నుంచే పాటలు రాయడం అలవ రుచుకున్నారు. స్థానికంగా ఉన్నత విద్యా భ్యా సం చేసిన బాపు, 1999లో హైదరాబాద్‌కు తన మకాం మార్చారు. సినీ అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో ‘స్నేహితుడు’ అనే చిత్రం ద్వారా పాటల రచ యితగా తొలిఅవకాశం వచ్చింది. మొదటి సినిమాతోనే తనదైన ముద్ర వేశారు. దీంతో చాలా మంది సినీదర్శకులు తమ సిని మాల్లో బాపుకు అవ కాశం ఇచ్చారు. ‘గర్ల్‌   ఫ్రెండ్‌’ అనేచిత్రంలో ‘నువ్వు ఏ డికొస్తే ఆడికొస్త సువర్ణ’ అనే పాట బాపుకు మంచి గుర్తింపు తెచ్చింది. అటుపై ఆయన ఇక వెనుదిరిగి చూడలేదు. 
 
శ్రీరామచంద్రుడు, జానకి వెడ్స్‌ శ్రీరామ్‌, ప్రేమలో పావని, శ్రీమంతుడు, అధినేత, పటాస్‌, సెల్ఫీరాజా, త్వరలో విడుదల కానున్న ‘అచా ర్య అమెరికా యాత్ర’ సినిమాల్లో దాదాపు 300కు పైగా పాటలురాశారు. అన్నిరకాల పా టలు రాయడం బాపు ప్రత్యేకత. ఈ క్రమంలో చలన చిత్రదర్శకుడు దివం గత దాసరి నారాయణరావు సహా పలువురు హీరోలు వివిధ సందర్భాల్లో బాపును సన్మానించి, ప్రోత్స హించారు. 
 
పట్టుదల ఉంటే సినీ రంగంలో రాణించవచ్చు.
పట్టుదల ఉంటే సినీరంగంలో రాణించ వచ్చు. కవులు, రచయితలు, కళాకారులకు సామాజిక బాధ్యత ఉండాలి. దర్శకుడు చె ప్పిన సందర్భానికి అనుగుణంగా పాటలు రాయాల్సి ఉంటుంది. అనుభవం పెరిగే కొద్దీ పాటలు రాయడం సులువవుతుంది. ప్రస్తుతం ‘ఆచార్య అమెరికా యాత్ర’ చిత్రం కోసం ఐదు పాటలు రాశాను. భవిష్యత్‌లో మంచి పాటలు రాసి అన్ని వర్గాల ప్రజల మెప్పు పొందాలని ఉంది. కోల్‌బెల్ట్‌లో ఉన్న కళాకారులెవరూ నిరాశచెందకుండా సినీ రంగంలో అవకాశాల కోసం పట్టువిడవకుండా ప్రయత్నించాలి.