ప్రొఫెసర్‌ జయధీర్‌ తిరుమలరావు

రాజకీయంగా మార్పు లేదు

ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌

కవాడిగూడ/హైదరాబాద్‌, జూలై 16: భౌగోళిక తెలంగాణ సాధించుకున్న తర్వాత రచయితల బాధ్యత మరింత పెరిగిందని ప్రొఫెసర్‌ జయధీర్‌ తిరుమలరావు అన్నారు. ఆదివారం కవాడిగూడలోని హైదరాబాద్‌ స్టడీ సర్కిల్‌లో నేటి సాహిత్యం-ప్రజలు-రచయితల బాధ్యతలు అనే అంశంపై సదస్సు జరిగింది. ఎన్‌.తిరుమల్‌ రచించిన చురక పుస్తకాన్ని కె.శ్రీనివాస్‌ ఆవిష్కరించారు. జయధీర్‌ తిరుమలరావు మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడింది, రాయడానికి ఏమీ లేదని కవులు, రచయితలు అపోహ పడుతున్నారని భౌగోళిక తెలంగాణ ఏర్పడిన తర్వాత రచయితల బాధ్యత మరింత పెరిగిందని పేర్కొన్నారు. కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఉద్యమంతో భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం తప్పితే, రాజకీయంగా ఎలాంటి మార్పు రాలేదని అన్నారు. అధికారంలోకి వచ్చిన వారు ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయడం లేదని చెప్పా రు. తెలంగాణ వచ్చిన తర్వాత వందలాది మంది రైతుల ఆత్మహత్యలు జరిగినా పట్టించుకోని సీఎం కేసీఆర్‌, మూడేళ్ల తర్వాత రె తులు ఆత్మహత్యలు చేసుకోవద్దని వారికి ఎకరానికి రూ.8 వేల చొప్పున ఇన్‌పుట్‌ సబ్సి డీ ప్రకటించారని పేర్కొన్నారు. ఉస్మానియా వర్సిటీలో అదే నిర్బంధం కొనసాగుతోందని.. ప్రొఫెసర్‌ కోదండరాం ఇంటి తలుపులు బద్దలుకొట్టినా సమాజం స్పందించలేదన్నారు.

 

మనం ఏం చేయాలి, ఏం చేస్తే సమస్య పరిష్కారం అవుతుందనే విషయంపై రచయితలు ఆలోచించాలని కోరారు. జూకంటి జగన్నాథం, కవులు, రచయితలు హాజరయ్యారు.