హైదరాబాద్, సోమాజిగూడ: పద్మ పురస్కార గ్రహీతలు మట్టిలో మాణిక్యాలని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ప్రాధాన్యం ఇస్తోందని, ప్రధాని నరేంద్రమోదీ ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారు.శుక్రవారం నెకె్ల్‌సరోడ్‌ పీపుల్స్‌ ప్లాజాలో నెహ్రూ యువ కేంద్ర సంఘటన్‌ ఆధ్వర్యంలో పద్మ పురస్కార గ్రహీతల అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి దత్తాత్రేయ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్సీ రామ చందర్‌రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ హాజరై పురస్కార గ్రహీతలు డాక్టర్‌ అబ్దుల్‌ వాహిద్‌, త్రిపురనేని హనుమాన్‌ చౌదరి, యాదగిరి రావు, చింతకింది మల్లేశం, దరిపల్లి రామయ్యలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ పద్మ పురస్కార గ్రహీత త్రిపురనేని హనుమాన్‌ చౌదరి సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్యులకు అందించేందుకు తీవ్రంగా కృషి చేశా రన్నారు. రామయ్య సామాన్య వ్యక్తి అని సైకిల్‌పై తిరుగుతూ మొక్కలపై అవగాహన కల్పించడంతో పాటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొక్కలను నాటి దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. బంగారు తెలంగాణ సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నా రన్నారు. అనంతరం హోంశాఖా మంత్రి నాయిని మా ట్లాడుతూ రాష్ట్రానికి ఎక్కువ అవార్డులు రావడం అభి నందనీ యమన్నారు. అనంతరం చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర సంఘటన్‌ వైస్‌ చైర్మన్‌ పేరల శేఖర్‌రావు పాల్గొన్నారు.