చైనా నుంచి 8 మంది రచయితల రాక

గుజరాత్‌ కవులు, రచయితల హాజరు

హైదరాబాద్‌, జనవరి 18(ఆంధ్రజ్యోతి): ఈ నెల 25 నుంచి 27 వరకు ‘హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌-2019’ నిర్వహిస్తున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ప్రతి ఏటా లిటరరీ ఫెస్టివల్‌కు ఒక దేశం, ఒక రాష్ట్రాన్ని ఎంపిక చేసి కవులు, రచయితలను ఆహ్వానించటం ఆనవాయితీ అని చెప్పారు. ఈ సారి చైనా నుంచి 8 మంది కవులు, రచయితల బృందం, గుజరాత్‌ నుంచి కవులు, కళాకారులు హాజరవుతారని తెలిపారు. లిటరరీ ఫెస్టివల్‌ నిర్వాహకులు అజయ్‌గాంధీ, టి.విజయ్‌ కుమార్‌, అమిత్‌ దేశాయ్‌, గొయితె జెంత్రమ్‌, శ్రీనివాస మూర్తి, వీనా రాణి తదితరులతో కలిసి ఆయన శుక్రవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో నిర్వహించే ఈ కార్యక్రమానికి అందరూ అహ్వానితులేనన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 200 మంది కవులు, రచయితలు పాల్గొంటారని తెలిపారు. పుస్తకావిష్కరణలు, సాంస్కృతిక, పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేశామన్నారు.