హైదరాబాద్, ఉప్పల్‌ : భారత్, ఐర్లాండ్‌ దేశాల మధ్య సాహిత్య సంబంధాలు ఎంతో పురాతనమైనవని, ఐర్లాండ్‌లోని ప్రముఖ రచయితల రచనలు చదివిన ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని చెబుతారని భారతలోని ఐర్లాం డ్‌ దేశ రాయబారి డాక్టర్‌ బ్రియాన్, మ్యాక్‌ ఎల్డఫ్‌ పేర్కొన్నారు. ఓయూ సెంటర్‌ ఫర్‌ ఇంటర్‌నేషనల్‌ ప్రోగ్రామ్స్‌(ఓయూసీఐపీ) ఇండియన్‌ సొసైటీ ఫర్‌ కామనవెల్త్‌ స్టడీ్‌స(ఐఎ్‌ససీఎ్‌స)తో కలిసి ‘ఎమర్జెన్స ఆఫ్‌ గ్లోబలైజేషన - టువర్డ్స్‌ ట్రాన్స నేషనలిజం’ అనే అంశంపై గురువారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

బ్రియాన్‌ మాట్లాడుతూ ఐర్లాండ్‌కు చెందిన ప్రముఖ రచయిత డబ్ల్యూబీ ఈట్స్‌ రచనలను పరిశీలిస్తే ఆయన రచనలపై భారత సంస్కృతి, సంప్రదాయాలు, ఇతిహాసాలు, పురాణాల ప్రభావం ఉన్నట్లు తెలుస్తుందన్నారు. దీంతో ఐర్లాండ్‌, భారత దేశాల మధ్య సాహితీ పరమైన సంబంధాలు బాగా ఉన్నాయని అర్థమవుతోందని చెప్పొచ్చన్నారు. ఐర్లాండ్‌ రచయితలు సిమసిమి, జేమ్స్‌ జాయిసీ, సాముల్స్‌, బెర్నార్డ్‌షా వంటి వారి రచనలను ప్రస్తుతం భారతదేశంలోని వివిధ యూనివర్సిటీల్లోని ఎంఏ ఇంగ్లిషు విద్యార్థులు తమ పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశంగా చదువుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఓయూ రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ గోపాల్‌రెడ్డి, విక్రమ సింహపురి యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్‌ విశ్వేశ్వర్‌రావు, ఓయూ సీఐపీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కరుణాకర్‌, ఐఎ్‌ససీఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఆర్‌కే ధావన పాల్గొన్నారు.