చిక్కడపల్లి, మార్చి22(ఆంధ్రజ్యోతి): సంగీతం నిత్యజీవితంలో ఒక భాగమైతే ఆరోగ్యకరమైన సమాజం రూపొందుతుందని తెలంగాణ బీసీ కమిషన్‌ సభ్యుడు డా. వకుళాభరణం కృష్ణమోహనరావు అన్నారు. మానవాళి ఎదుర్కొంటున్న అనేక  శారీరక, మానసిక సమస్యలకు సంగీతంతోనే ఉపశమనం లభిస్తుందన్నారు. శుక్రవారం రాత్రి త్యాగరాయగానసభలో జీఎస్‌ ఆర్ట్స్‌ అధినేత జి. శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి  నిర్వహించారు. ఈసందర్భంగా ప్రముఖ సినీ నటుడు  జెన్నీ(పోలాప్రగడ జనార్దనరావు), సంఘసేవకురాలు చింతల పోశవ్వ, ప్రముఖ మెజీషియన్‌ బీఎన్‌ఎ్‌స కుమార్‌, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆచార్య రేఖారావులకు అభినందన సత్కారాలు చేశారు. ఈ సందర్భంగా వకుళాభరణం కృష్ణమోహనరావు మాట్లాడుతూ  గానసభలో జరిగే సంగీత కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రేవతి, రాగరేఖ, శ్రీనివాస్‌, మాధవి, అనురాధ, గోవిందలక్ష్మి, తోట శ్రీలక్ష్మి, రవిమన్యు, బైరి శ్రీనివాస్‌, ఏవీ రమణ, రాము తదితరులు పాడిన పాటలు అలరించాయి.