కల్చరల్‌, ఆంధ్రజ్యోతి: తెలుగువారి సంప్రదాయ నాట్యరీతుల వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గురువు నటరాజ రామకృష్ణ  జయంతి బంజారాహిల్స్‌లోని లామకాన్‌ లో గురువారం సాయంత్రం 6.గంటలకు నిర్వహించనున్నారు. నటరాజ రామకృష్ణపై అభిమానంతో నాట్యంతో సంబంధం లేని యువకుడు ఫర్హతుల్లా బేగ్‌  ఆయనకి చెందిన  అపురూపమైన విశేషాలను నమోదు చేస్తున్నారు. రామకృష్ణ ప్రియశిష్యుడు కళాకృష్ణ ,నాట్యరంగ నిష్ణాతురాలు, ప్రొఫెసర్‌, జొన్నలగడ్డ అనురాధతోపాటు ఫర్హతుల్లా బేగ్‌  రామకృష్ణ జయంతిని నిర్వహించనున్నారు. ఆంధ్రనాట్యం. పేరిణి నృత్యాలతో పాటు పలుగ్రంథాలను  రచించిన నటరాజ రామకృష్ణ జీవిత విశేషాలను స్మరించుకునేందుకు  ఫర్హతుల్లా బేగ్‌ కళాభిమానులను ఆహ్వానిస్తున్నారు.