సనత్‌నగర్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): హిందూ పురాణాల్లో అత్యంత క్లిష్టమైన పాత్రల్లో ఒకటైన రావణ్‌ గురించి అత్యంత ఆసక్తికరంగా అమిష్‌ త్రిపాఠీ రచించిన ‘రావణ్‌: ఎనిమీ ఆఫ్‌ ఆర్యవర్త’ పుస్తకావిష్కరణ సోమాజిగూడలోని ల్యాండ్‌మార్క్‌ స్టోర్‌లో జరిగింది. తన అభిమానులు, చదువరులను కలుసుకున్న అమి్‌ష త్రిపాఠీ తాను రచించిన రామచంద్ర సిరీ్‌సలోని మూడో పుస్తకం రావణ్‌ గురించి మాట్లాడుతూ  ‘రావణ్‌ : ఎనిమీ ఆఫ్‌ ఆర్యవర్త’ పుస్తకంలో భారతదేశంలో పురాణ సంబంధిత ఫిక్షన్‌ రచయితల్లో సుప్రసిద్ధ రచనలు, ఇమ్మోర్బల్స్‌ ఆఫ్‌ మెలుహా, ద ఓత్‌ ఆఫ్‌ ద వాయుపుత్రాస్‌, సీత: వారియర్‌ ఆఫ్‌ మిథిల వంటి రచనలు రాయడం జరిగిందన్నారు.