చిక్కడపల్లి(హైదరాబాద్), ఆగస్టు 15: డా. వుప్పల లక్ష్మణరావు మానవతావాది, దేశభక్తుడని వక్తలు పేర్కొన్నారు. శ్రీ మానస ఆర్ట్‌ థియేటర్స్‌ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి త్యాగరాయగానభలో ప్రముఖ రచయిత అడపా రామకృష్ణ సంకలనం డా.వుప్పల లక్ష్మణరావు సాహితీ స్ఫూర్తిమంతం పుస్తకావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా పుస్తకాన్ని ఆవిష్కరించిన శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ పూర్వ వీసీ ఆచార్య కొలకలూరి ఇనాక్‌ మాట్లాడుతూ లక్ష్మణరావు బరంపురం ముద్దుబిడ్డఅన్నారు. సాహిత్యంలో అతడు ఆంధ్రదేశంలో అశేష పాఠకులను, మేధావులను కదిలించారన్నారు. ఆయన జీవితం సదా స్ఫూర్తిమంతమైనదన్నారు. రవి రఘుశ్రీ మాట్లాడుతూపరిశోధనా ఫలాలు దోపిడీదారులకు ఉపయోగపడితే సమాజానిక ఏంలాభం అని ఆయన మనసులోని ప్రశ్నతో జర్మనీలో తన పరిశోధనను మధ్యలోనే ఆపేశారన్నారు. 

ఈ సమావేశంలో గానసభ అధ్యక్షుడు కళాజనార్దనమూర్తి, దేవరకొండ సహదేవరావు, అనంతరావు, రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడిసింగు హన్మంతరావు స్మారక ప్రతిభా పురస్కారాలను ఆత్మబంధు ఆచార్య హనుమంతరాయశర్మ, అడపా రామకృష్ణకు ప్రదానం చేశారు.