హైదరాబాద్, రవీంద్రభారతి: ప్రగతిశీల మాన వతా వాదాన్ని కవితా సిద్ధాంతంగా చేసుకుని తనదైన మార్గంలో సాహిత్యాన్ని సృష్టించిన మహా కవి సినారె అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి అన్నారు. ఆదివారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ, తెలంగాణ రచయిత సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మహా కవి సినారె సాహిత్య సమాలోచన శీర్షికన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా నందిని సిధారెడ్డితో పాటు తెలుగు వర్సిటీ వీసీ ఎస్వీ సత్యనారాయణ, దేశపతి శ్రీనివాస్‌, మామిడి హరికృష్ణ, బాల శ్రీనివాసమూర్తి, నాళేశ్వరం శంకరం, కందుకూరి శ్రీరాములు, నారా యణశర్మ తదితరులు హాజరై సినారెను స్మరించుకున్నారు.సినారె సృ జించని సాహితీ అంశం లేదంటూ అన్నింటిలో మానవుడే కేంద్ర బిందువుగా రచనలు చేశారన్నారు.