రవీంద్రభారతి, మే 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ డ్యాన్స్‌ ఫెస్టివల్‌ శీర్షికన బుధవారం రవీంద్రభారతిలో జరిగిన నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. నటరాజ అకాడమి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో సుమారు 300మంది చిన్నారులు నృత్య ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే నృత్య ప్రదర్శనలు ప్రదర్శించారు. మయూరి రాధా, స్వాతి, సాయిప్రియ, దత్తు, జాన్విరెడ్డి, శృతియాదవ్‌ తదితర గురువుల వద్ద శిక్షణ పొందిన చిన్నారులు ఈ ప్రదర్శనలో నర్తించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ హాజరై కళాకారులను సత్కరించి అభినందించారు. తెలంగాణ సంస్కృతిని కాపాడే కార్యక్రమాలకు ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, ఏనుగు లక్ష్మణ్‌, శ్రవణ్‌కుమార్‌, రఘువెంకట్‌, దైవజ్ఞశర్మ, గిరి, తదితరులు పాల్గొని చిన్నారి కళాకారులను సత్కరించి అభినందించారు.