చిక్కడపల్లి, జూలై 16(ఆంధ్రజ్యోతి): తెలుగుజాతిని ఉత్తేజితం చేసిన మహాకవి శ్రీశ్రీ అని వక్తలు పేర్కొన్నారు. యువభారతి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి త్యాగరాయగానసభలో మహాకవి ‘శ్రీశ్రీ సాహిత్యం-వ్యక్తిత్వం సాహిత్య సమాలోచన’ సమావేశం జరిగింది. యువభారతి ప్రధాన సంపాదకుడు సుధామ రచించిన ‘వసుధా(స)మయం’ గ్రంథావిష్కరణ జరిగింది ఈ పుస్తకాన్ని యువభారతి సమావేశకర్త ఆచార్య వంగపల్లి విశ్వనాథం అంకితం తీసుకున్నారు. సభలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి దాసరి శ్రీనివాసులు, అరసం జాతీయ కార్యవర్గ సభ్యుడు వేల్పుల నారాయణ, కళా జనార్దనమూర్తి, రచయిత్రి డాక్టర్‌ కేబీ లక్ష్మి తదితరులు పాల్గొని ప్రసంగించారు. తెలుగు భాషను విశ్వవ్యాప్తం చేయడంలో శ్రీశ్రీ కృషి కొనియాడదగిందన్నారు. ఆయన రచనలు ఈ తరానికి కూడా ఎంతో స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. ఆయనను ఈ తరం కవులు స్ఫూర్తిగా తీసుకుని రచనలు చేసి సమాజాన్ని జాగృతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆచార్య ఫణీంద్ర, జీడిగుంట వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.