ద్రాక్షారామ,తూర్పు గోదావరి జిల్లా: ద్రాక్షారామ నాటక కళాపరిషత్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి నాటక పోటీలో మూడోరోజు ప్రదర్శితమైన ‘కేవలం మనుషులం’ నాటిక ఆలోచింపజేయగా, మరో నాటిక ‘చేతిరాత’ ఆకట్టుకుంది. తొలి ప్రదర్శనగా అభినయ ఆర్ట్స్‌ గుంటూరు వారు కేవలం మనుషులం ప్రదర్శితమైంది. మతంకన్నా మానవత్వం మానవ సంబంధాలు గొప్పవన్న విషయం గుర్తించడంతో కేవలం మనుషులం కథసుఖాంతం అవుతుం ది. ద్వితీయ ప్రదర్శనగా జన చైతన్య ఒంగోలు వారిచే చేతిరాత నాటిక ప్రదర్శితమైంది. అలాగే జ్ఞానమనే కుంచెతో రాసుకుంటే జీవితం ఆనందమయం అవుతుందని, లేకుంటే అంధకారం అవుతుందనే సందేశంతో చేతిరాత ముగిసింది.
 
కళాకారుల పింఛన్‌ పెంచేందుకు కృషి : ఎమ్మెల్యే తోట 
కళలను,కళాకారులను ప్రోత్సహించాల్సిన అవ సరం ఉందని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అన్నా రు. ఆదివారం రాత్రి మూడో రోజు నాటిక ప్రదర్శనలు ప్రారంభసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నాటకాలు సమాజంలో ఎన్నో సామాజిక సమస్యలను ఎత్తి చూపుతాయన్నారు. నాటక పోటీలను ఆదరించవలసిన అవసరం ఉందన్నా రు. వృద్ధ కళాకారులకు ప్రస్తుతం ఇస్తున్న పింఛన్‌ రూ.1500 పెంచేందుకు కృషిచేస్తానని ప్రకటించారు. ద్రాక్షారామలో అందుబాటులో ఉన్న స్థలం లో అందరూ కలిసి వస్తే ఆడిటోరియం నిర్మాణం చేయిస్తానన్నారు. సమావేశంలో డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, మూలారెడ్డి నాటక కళాపరిషత్‌ వ్వవస్థాపకులు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి మాట్లాడారు. నటుడు, దర్శకుడు కొర్ల నాగేశ్వరాను నాటక కళాపరిషత్‌ కన్వీనర్‌ నాగిరెడ్డి సతీష్‌, మూలారెడ్డిలు సత్కరించారు.