హైదరాబాద్‌ సిటీ, జూన 25 (ఆంధ్ర జ్యోతి): కవితా ప్రపంచం నుంచి తెలుగులో ఏ కవికి లభించని నివాళి సినారెకు దక్కిందని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి అన్నారు. ఏ అక్షరాన్ని ప్రేమించాలి..? ఏ అక్షరాన్ని సృష్టించాలనే విషయంలో సినారెకు చాలా స్పష్టత ఉందని తెలిపారు. సుందరయ్య విజ్ఞానకేంద్రంలో తెలుగు సాహిత్య కేతనం సినారెకు హైదరాబాద్‌ కవుల వేదిక ఆధ్వర్యంలో కవి తా నివాళి కార్యక్రమం ఆదివారం జరిగింది. ము ఖ్యఅతిథిగా వచ్చిన నందిని సిధారెడ్డి మాట్లాడు తూ కవిత్వానికి గ్లామర్‌ తీసుకొచ్చిన కవి సినారె అని ముఖ్యమంత్రి ప్రశంసించడం గొప్ప విషయ మన్నారు. తెలుగు ప్రపంచాన్ని కుదిపే సంచలన వాదాలు ఎన్నో వచ్చాయని, ఆయన మాత్రం ఎ క్కడా తొణకకుండా, తన కలానికి పనిచెప్పారని పేర్కొన్నారు. 1954 నాటికే సినారె యువకవిగా విజృంభించారని చెప్పారు. ‘కాళ్లు, చేతులు ఆడిం చి.. ఆయాస పడి, ఈత నేర్చుకున్నవాళ్లు ఇవ్వాల గట్టున కూర్చొని ఈత నేర్చుకునే వాళ్లను విమర్శిస్తున్నారు’ అని కరీంనగర్‌ నుంచి వెలువడిన సరస్వతి జ్యోతి పత్రికలో సినారె రాసిన వ్యాసం ఎం తోమందిలో ఆలోచనలను రేకెత్తించిందని గుర్తు చేశారు. పెద్ద కవులు యువ కవులను విమర్శించడం సరికాదని చెప్పడంలో సినారె ధోరణి ఎం తో గొప్పదని కొనియాడారు. ఏ లక్ష్యంతో కవితలు రాయాలో ఆయనకు స్పష్టత ఉందని చెప్పారు. మనిషినే ఓ వస్తువుగా తీసుకుని కవిత్వం రాయడంలో సినారె విజయం సాధించారని తెలిపారు. యువతరంతో పోటీపడేవారని సిధారెడ్డి చెప్పారు. అనంతరం ప్రజా గాయకుడు దేశపతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ సినారె అస్తమించినా నక్షత్రం వలె ప్రకాశిస్తున్నారన్నారు. 

సినారె రాసిన గేయాలు అ ద్భుతంగా ఉంటాయని కొనియాడారు. ‘అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు.. సరితూగమంటే ఒరిగెను అమ్మవైపు నేను’ అని తనకు అమ్మపై ఉన్న ప్రేమను సినారె చాటుకున్నారని తెలిపారు. ఎం తో మధురంగా, రమ్యంగా గీతాలు రాసిన వ్యక్తి సినారె అని ప్రముఖ కవి నిఖిలేశ్వర్‌ కొనియాడారు. వ్యక్తిగత స్నేహాన్ని నిలుపుకున్న వ్యక్తి సినా రె అన్నారు. ఎప్పుడూ చిరునవ్వు చిందించే వ్యక్తి సినారె అని అమ్మంగి వేణుగోపాల్‌ చెప్పారు. ఆ యన నిర్వర్తించిన పదవులన్నీ కవి అనే పునాది పైనే ఆధారపడి వరించాయని తెలిపారు. తెలుగు విశ్వవిద్యాలయంలో మొట్టమొదటి సారిగా స్నాతకోత్సవం నిర్వహించింది సినారెనని ఆంధ్రసారస్వత పరిషత కార్యదర్శి చెన్నయ్య గుర్తు చేశారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా స్నాతకోత్సవానికి సూచనలు చేశారని తెలిపారు. తెలంగాణకు కవిత్రయం కాళోజీ, దాశరథి, సినారె అని డాక్టర్‌ నళేశ్వరం శంకర్‌ అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కవులు సినారెపై రాసుకున్న కవిత్వాలను పఠించి నివాళులుగా అర్పించారు. సినారెపై వచ్చి న కవిత్వాలన్నింటితో త్వరలో ఓ పుస్తకం వేస్తామని హైదరాబాద్‌ కవుల వేధిక వ్యవస్థాపకులు డాక్టర్‌ ఏనుగు నరసింహా రెడ్డి తెలిపారు.