హైదరాబాద్,ఆంధ్రజ్యోతి:ఒకే వేదికపై విభిన్నంగా, ఆకట్టుకునేలా సాగిన నాట్య, శిల్ప, చిత్ర, సైకత కళారూపాల ప్రదర్శన కార్యక్రమం జరి గింది. ఈ కార్యక్రమం వేదం సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం సాయం త్రం సుందరయ్యవిజ్ఞానకేంద్రం వేదికపై ఏర్పాటు చేశారు. నాట్య, శిల్ప, చిత్ర, సైకత కళారూపాలను ఒకే వేదికపైన ఒక హారంగా ఆవిష్కరింపచేసే వినూత్న ప్రయోగమే ఈ నాట్యం- శిల్పం కార్యక్రమం. ప్రముఖ నర్తకి, నాట్యాచారిణి వసుమతి వర్కాల పర్యవేక్షణలో ఆమె స్వయంగా కూచిపూడి నృత్యాన్ని అభినయిచండంతోపాటు తన శిష్యగణంతో కలిసి నృత్యాన్ని ప్రదర్శించి శ్రోతల హర్షధ్వానాలు అందుకున్నారు. నృత్యకళను, లలిత కళ, శిల్పకళను ఒకే వేదికపై ప్రదర్శింపచేయడం ఈ కార్యక్రమంలోని విశిష్టత. పొటెన్షియల్‌ మైండ్స్‌ నిర్వహణలో ఈ కార్యక్రమం ఆకట్టుకుంది. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్‌, అరోరా విద్యాసంస్థల కార్యదర్శి రమేష్‌బాబు, అరోరా కాలేజీ ఫ్యాకల్టీ  పాల్గొని కళాకారులను అభినందించారు.