అకట్టుకున్న జానపద నృత్యాలు 
మాదాపూర్‌,హైదరాబాద్: శిల్పారామంలో ఉగాది సంబురాలు కనుల పండువగా ప్రారంభమయ్యాయి. శిల్పారామం, సౌతజోన్‌ కల్చరల్‌ సెంటర్‌ సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే ఉగాది వేడుకలను శిల్పారామం స్పెషల్‌ ఆఫీసర్‌ కిషన్‌రావు సోమవారం ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన జానపద కళకారులు తమ కళారూపాలతో నిర్వహించిన ప్రదర్శనలు సందర్శకులను విశేషంగా అకట్టుకున్నాయి. జార్ఖండ్‌, హర్యానా, తమిళనాడు, గుజరాత రాష్ర్టాలకు చెందిన జానపద కళకారులు ప్రదర్శించిన వివిధ ప్రాచీన నృత్యాలు అహుతులను కట్టిపడేశాయి. మూడు రోజుల పాటు జరిగే ఉగాది సంబురాల్లో దేశంలోని పలు రాష్ర్టాలకు చెందిన 180 మంది జానపద కళకారులు పాల్గొని భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింభించనున్నట్లు నిర్వాహాకులు తెలిపారు.