హైదరాబాద్,ఆంధ్రజ్యోతి:నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌం డ్స్‌లో తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పు స్తకాల స్టాల్‌ను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ మంగళవా రం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉర్దూ భాష పరిరక్షణకు ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోందని, అందులో భాగంగానే ఆనాటి పురాతన పుస్తకాలతో పాటు విద్యార్థులకు, పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఉపయోగిపడే విధంగా పలు కాంపిటేటివ్‌ పుస్తకాలను ఉర్దూ మాధ్యమంలో ప్రచురించి అందుబాటు లో ఉంచుతామన్నారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ డైరెక్టర్‌, మైనార్టీ శాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.