ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి

వనస్థలిపురం, ఫిబ్రవరి18, (ఆంధ్ర జ్యోతి): అంతరించి పోతున్న కళల రక్షణకు ప్రత్యేక నిధులతో వనస్థలిపురంలో రంగస్థల కళాకారుల భవనాన్ని నిర్మించి కళాకారులకు అండగా ఉంటామని రాష్ట్ర సలహాదారు కేవీ రమణాచారి అన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి అన్ని జిల్లా హెడ్‌ క్వార్టర్స్‌, మండల ప్రాంతాల్లో రంగస్థల భవనాల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. వనస్థలిపురం, ఎన్జీవోస్‌ కాలనీ కమ్యూనిటీ హాల్‌ ప్రాంగణంలో రంగస్థల కళాకారుల అభిమాన సమాఖ ఆధ్వర్యం నిర్వహించిన సాంఘిక నాటక పోటీలకు ఎమ్మెల్సీ రామచంద్రారావుతో కలిసి హాజరై ప్రసంగించారు. రంగస్థల భవనానికి రూ. 15 లక్షల రూపాయలను అందజేస్తామని ఎమ్మెల్సీ రామచంద్రారావు హామీ ఇచ్చారు. ముగింపు రోజు సందర్భంగా హైదరాబాద్‌ శ్రీజయ ఆర్ట్స్‌ ప్రదర్శించిన నీతి రేఖలు, మహతి క్రియేషన్స్‌ అల్పజీవి నాటక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. ప్రముఖ నటులు తులసీ బాలకృష్ణ, ఎం.ఎస్‌.కే ప్రభు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. 

రంగారెడ్డి జిల్లా నాటక సమాజాల అధ్యక్షుడు సూర్యవర్థన్‌రెడ్డి, తడకమళ్ల రామ చంద్రారావు, బీచరాజుశ్రీధర్‌, సుబ్బారాయ శర్మప్రసాద్‌రెడ్డి, సమాఖ్య అధ్యక్షుడు పంపన వెంకటేశ్వర్‌రావు,. పుండరీకాక్షడు నందిరాజు లక్ష్మీనారాయణ, మారంరాజు రామచంద్రారావు, మట్టపర్తి చంద్రారావు, సాదు శ్యామ్‌ ప్రసాద్‌, చారి, బుగ్గయ్య, గోపాల్‌రావు, రామ్మూర్తి, ఆంజనేయులు, జగన్నాథరావు, జడ్జి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.