నెల్లూరు, ఆగస్టు 6: సమాజాన్ని అన్వేషించగలిగిన వాడే కవిత్వం రాయగలడని,, అదే అసలు సిసలైన కవిత్వంగా నిలుస్తుందని ప్రముఖ కవి, పాత్రికేయుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహిత దేవీప్రియ అన్నారు. ప్రముఖ కవి శివారెడ్డి కవిత్వం, జీవనచిత్రాలపై ఈతకోట సుబ్బారావు సంపాదకత్వంలో అచ్చయిన ‘అతడు-మేము’ సంపుటి ని సోమవారం నెల్లూరులో దేవీప్రియ ఆవిష్కరించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ కవిత్వాన్ని సమాజం నుంచే తీసుకోవాలని, అప్పుడే ఆ కవిత్వం బతికి బట్టకడుతుందన్నారు. కవుల చరిత్ర, జీవన విధానం, శైలిని రికార్డు చేయాల్సిన అవసరం ఉందని, భావితరాలకు అదొక పరిశోధన గ్రంథంగా నిలుస్తుందని అన్నారు.