రాయదుర్గం, సెప్టెంబర్‌25(ఆంధ్రజ్యోతి): మానవీయ కోణాలను లోతుగా ప్రతిబింబిస్తున్న సినిమా  ప్రపంచ భాషగా అభివృద్ధి చెందుతోందని   పద్మశ్రీ అపూర్బ కిషోర్‌బిర్‌ అన్నారు. గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీలోని  ఇన్‌స్ట్రక్షన్‌ మీడియా సెంటర్‌ ఆధ్వర్యంలో సినిమాటిక్‌ లాంగ్వేజ్‌ అండ్‌ హ్యూమన్‌ డెవల్‌పమెంట్‌ అనే పేరుతో ఉపన్యాస కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ భాషగా సినిమా పలు ప్రాంతాల స్థితిగతులను ప్రతిబింబించి భావి తరాలకు జ్ఞాపకంగా మిగులుతోందన్నారు.  అసమానతలను కథాంశాలుగా తీసుకుని రూపొందించిన అనేక చిత్రాలు సమాజంలో మార్పులకు కేంద్రబిందువుగా మారాయన్నారు.  కార్యక్రమంలో సీనియర్‌ సౌండ్‌ఇంజనీర్‌ రవిశంకర్‌, వీసీ ప్రొఫెసర్‌ షకీల్‌అహ్మద్‌, ఐఏఎంసీ డైరెక్టర్‌ విజ్వాన్‌ అహ్మద్‌, ప్రొడ్యూసర్‌, వర్క్‌షాపు కో-ఆర్డినేటర్‌ ముజాహిద్‌ అలీ, ఐఎంసీ రిసెర్చ్‌ ఆఫీసర్‌ ఇంతియాజ్‌ అలాం  పాల్గొన్నారు.