హైదరాబాద్‌, ఫిబ్రవరి13 (ఆంధ్రజ్యోతి): బ్రెయిలీ లిపిలో రూపొందించిన గోల్కొండ చరిత్ర పుస్తకాన్ని ప్రభుత్వ కార్యదర్శి  వెంకటేశం బుధవారం సచివాలయంలో విడుదల చేశారు. ఆర్కిలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలో(ఏఎస్‌ఐ) సూపరెంటెండింగ్‌ ఆర్కియాలజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్‌ మిలన్‌ కుమార్‌ చొరవతో ఈ పుస్తకాన్ని రూపొందించారు. చరిత్రను అందరూ అధ్యయనం చేయాలన్న ఉద్దేశంలో ఏఎస్‌ఐ ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని  వెంకటేశం  అన్నారు.  ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌ రెడ్డి  పాల్గొన్నారు.