హైదరాబాద్, రవీంద్రభారతి: తెలంగాణ భాషకు సాహిత్య గౌరవాన్ని తెచ్చిన గొప్ప రచయిత డాక్టర్‌ కాలువ మల్లయ్య అని జ్ఞానపీఠ్‌ పురస్కారగ్రహీత డాక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. పరిషత్తులో సోమవారం రచయిత కాలువ మల్లయ్య పరిణతవాణి కార్యక్రమంలో సినారె అధ్యక్ష్యోపన్యాసం చేశారు. రచనల పరంగా వయసు పరంగా పరిణతమైనవారి స్వీయజీవిత విశేషాలు ఆవిష్కరించే పరిణతవాణి ప్రసంగ పరంపరకు విశేషమైన ఆదరణ లభించిందని అన్నారు. కాలువ మల్లయ్య మాట్లాడుతూ 1952 జనవరి 12న కరీంనగర్‌ జిల్లాలో జన్మించిన తాను గ్రామీణ జీవన నేపథ్యం నుంచి రచయితగా ఎదిగానని చెప్పారు. తన రచనానుభవంలో తెలంగాణ జీవితాన్ని, భాషను, సంఘర్షణను రచనలుగా మాలిచానని అన్నారు. ఈ కార్యక్రమంలో పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జె.చెన్నయ్య, కోఽశాధికారి మంత్రి రామారావు, .గోవిందరాజు, రామకృష్టారావు పాల్గొన్నారు.