సైదాబాద్‌/హైదరాబాద్‌, జనవరి 19: లైంగిక వేధింపుల కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న గజల్‌ శ్రీనివాస్‌.. చంచల్‌గూడ జైలులో గురువారం రాత్రి సుమారు గంటపాటు గజల్స్‌ ప్రదర్శన ఇచ్చారు. ఈనెల 6న జైలు ఆవరణలో యోగా శిక్షణ శిబిరంలో తొలిసారిగా కొన్ని గజల్స్‌ పాడిన శ్రీనివాస్‌ సిబ్బందిని ఆకట్టుకున్నారు. దీంతో అధికారులు ఖైదీల కోసం గజల్స్‌ కార్యక్రమం ఏర్పాటు చేశారు. తెలుగు, హిందీ భాషల్లోని కొన్ని గజల్స్‌ను ఆయన పాడి వినిపించారు. కాగా.. వివిధ కేసుల్లో నిందితులైన 20 మంది ఖైదీలు ఉంటున్న బి-బ్యారక్‌లో శ్రీనివా్‌సను ఉంచినట్ట్టు సమాచారం. జైలుకు వచ్చిన తొలి రెండ్రోజులు భోజనం ముట్టని ఆయన.. ఆ తర్వాత భోజనంతోపాటు క్యాంటీన్‌లో టిఫిన్‌, బిస్కెట్లు, బ్రెడ్‌ తీసుకుంటున్నట్టు తెలిసింది.