గుంటూరు,ఆంధ్రజ్యోతి:ఈ నెల 6న జిల్లా పరిషత్‌ మీటింగ్‌ హాలులో తదేక గీతం వచన కవితా సంపుటి హిందీ అనువాదం మహక్‌ మాటికీ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే, చైర్‌పర్సన జానీమూన్‌, హిందీ అనువాద రచయిత డాక్టర్‌ నారాయణచార్యులు, కవయిత్రి షేక్‌ ఖాశీంబీ, కవి కోనూరి రవికుమార్‌ తదితరులు పాల్గొంటారు. జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి రచయిత్రీ డాక్టర్‌ సి. భవానీ దేవి అధ్యక్షత వహిస్తారు. తదేక గీతం తెలుగు వచనా కవిత్వాన్ని సోమేపల్లి వెంకటసుబ్బయ్య రచించారు.