సైన్స్‌ చక్రవర్తి, నాలుగు జాతీయ అవార్డుల గ్రహీత, మెట్‌కాఫ్‌ బంగారు పతక విజేత సి.వి.సర్వేశ్వర శర్మ. లెక్కలేనన్ని వ్యాసాలు, 60కథలు, మరో వంద పిల్లల కథలు, నాటికలు, కవితలు, పాటలు, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు రాశారాయన. కోనసీమ సైన్స్‌ పరిషత్‌ స్థాపించి, 35 ఏళ్ళుగా తెలుగు విద్యార్థులలో శాస్త్ర విజ్ఞానం పెంపొందిస్తున్నారు. సామాన్యుల ముంగిటకు చేర్చాలనే తపనతో 92 పాపులర్‌ సైన్స్‌ పుస్తకాలు రాసిన యాభై అవార్డుల గ్రహీత. తెలుగు విద్యార్థుల్లోని మేథో సంపత్తిని శాస్త్రవిజ్ఞానరంగంవైపు మళ్ళించాలనే ధ్యేయంతో నిరంతరం కృషి చేస్తున్నారు. 

ఈ తాజా పుస్తకం ‘సైన్స్‌ విండో’ లో 45 మంది శాస్త్రవేత్తల జీవితం, వారి కృషి ప్రపంచానికి వారు అందించిన విజ్ఞానపరిశోధనా ఫలితాలను స్ఫూర్తిమంతంగా రాశారు. ప్రతి విద్యార్థి తప్పక చదవాల్సిన పుస్తకమిది. ఆయన రాసిన మరో  పుస్తకం ‘ఆమె మనసు’ 18కథల సంపుటి. ప్రతిభర్తా తన భార్యను చేతగానిదనీ, అమాయకురాలనీ అనుకుంటాడుతప్ప ఆమెకు అవకాశం ఇచ్చిచూస్తే తననుతాను నిరూపించుకుంటుందని ఆలోచించడు. భార్య అభిప్రాయాలకు విలువ, గౌరవం ఇవ్వాలనీ చెప్పడమేకాదు, స్ర్తీ గొప్పతనాన్ని, అన్ని కోణాల్లోనూ ఆలోచించగల ఆమె ప్రతిభ, ఆలోచనాశక్తి సామర్థ్యాలను చాటిచెప్పే కథలివన్నీ.

 

ఆమె మనసు
(కథల సంపుటి)
సి.వి.సర్వేశ్వర శర్మ
ధర 90 రూపాయలు
పేజీలు 210
ప్రతులకు వి.జి.ఎస్‌. బుక్‌లింక్స్‌, సాయిరాం థియేటర్‌ వెనుక, విజయవాడ –01 ఫోన్‌ 0866–2510202 హైదరాబాద్‌  బ్రాంచ్‌, మరియు శ్రీరాజేశ్వరి బుక్‌స్టాల్‌, హైదరాబాద్‌ –12 ఫోన్‌ 040–24742570