కథకుడు, కవి కె.సదాశివరావు. విజ్ఞాన శాస్త్ర కల్పనా కథలెన్నో రాశారు. ఎమెస్కో వారు తాజాగా మార్కెట్‌లోకి తెచ్చిన సదా శివరావుగారి నాలుగు సంకలనాలలో  ఈ ‘ఆత్మాఫాక్టర్‌’ ఒకటి. ఇందులో పద్నాలుగు సైన్స్‌ ఫిక్షన్‌ కథలతోపాటు అంతర్జాతీయ ఖ్యాతి గడించిన మరో పదిమంది సైన్స్‌ఫిక్షన్‌ రచయితల జీవితం, వారి సైంటిఫిక్‌ ఫిక్షన్‌ కృషికి సంబంధించిన వ్యాసాలున్నాయి. ఇందు లోని విజ్ఞానశాస్త్ర కల్పనా కథలన్నీ పాఠకుణ్ణి భవిష్యత్తులోకి తీసుకెళతాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనిషి సాధించిన ఘనవిజయాలు అతడి అస్తిత్వాన్ని అదృశ్యం చేశాయని చెప్ప డమే టైటిల్‌ కథ ‘ఆత్మాఫాక్టర్‌’ సారాంశం. మనిషి యంత్రాలకు బానిసై అనుభూతు లను, ఆత్మను కోల్పోతాడని చెప్పే కథే ఇది. 
మనిషి మనిషిగా మిగలాలని చెప్పే చక్కని కథనశిల్పం, పఠనీయతగల కథలివన్నీ. 
-లలితా త్రిపుర సుందరి
 

 

ఆత్మాఫాక్టర్‌ సైన్స్‌ ఫిక్షన్‌ కథలు

కె.సదాశివరావు

ధర: 250 రూపాయలు, పేజీలు: 476

ప్రచురణ:ఎమెస్కో, ప్రతులకు సాహితి ప్రచురణలు, కాళేశ్వరరావురోడ్‌, సూర్యారావుపేట, విజయవాడ-02, 

ఫోన్‌: 0866-2436643