ఎన్నో కథలు, నవలలకు బహుమతులందుకున్న రచయిత్రి గంటి భానుమతి. 13కథలున్న ఈ తాజా పుస్తకం భానుమతిగారి తొమ్మిదవ కథానికల సంకలనం. ఇవన్నీ పలు పత్రికలలో వచ్చినవే. భానుమతి కథలు మనల్ని తట్టిలేపుతాయి. మనకి తెలిసిన, మనం మరచిపోయిన వాస్తవాల్ని కళ్ళకి కట్టి తస్మాత్‌ జాగ్రత్త! అంటూ మనల్ని మనం సరిదిద్దుకునేట్టు ఉంటాయి. ఇందులో తల్లిదండ్రులు తప్పక చదవాల్సిన టైటిల్‌ కథ ‘ఎందరో శిరీషలు!’ పిల్లల్ని సొంతంగా ఆలోచనీయడం లేదు తల్లిదండ్రులు. దానివల్లే వాళ్ళు మానసికరోగులుగా మారుతున్నారు. కన్నవారి కోరికల్ని రీచ్‌ కాలేక ఆత్మహత్యాయత్నాలు చేసేస్థితికి వస్తున్నారని హెచ్చరించే కథ. సాహిత్య ప్రయోజనాన్ని చాటే కథలివన్నీ.


ఎందరో శిరీషలు!
గంటి భానుమతి
ధర 120 రూపాయలు
పేజీలు 126
ప్రతులకు రచయిత్రి, అనుపమ కాలనీ, మల్లాపూర్‌
హైదరాబాద్‌–076 సెల్‌ 88 97 643 009 మరియు అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు