స్వాతంత్ర్య సమరయోధులు, మార్క్సిస్టు తత్వవేత్త, చరిత్ర పరిశోధకుడు, సాహితీవేత్త ఏటూకూరు బలరామమూర్తి. ఆయన శతజయంతి (23,సెప్టెంబరు, 1918–2018) ప్రచురణ ఈ పుస్తకం. నిరాడంబరుడు, బాల్యం నుంచీ సంస్కరణదోద్యమ కుటుంబ వాతావరణంలో గొప్పవ్యక్తులు, మేధావులు, తత్త్వవేత్తల సాంగత్యంలో పెరిగి ఇరవైఏళ్ళకే కడలూరులో జైలు శిక్ష అనుభవించారు. జైల్లో ఉండగా ఆయన రాసిన ‘ఆంధ్రుల చరిత్ర పుస్తకం 20వేల ప్రతులు అమ్ముడుపోయింది. ఉపసంపాదకుడుగా, ప్రధానసంపాదకుడుగా, ప్రచురణాలయ సంపాదకుడుగా (విశాలాంధ్ర దినపత్రిక), 40ఏళ్ళ రచనాజీవితంలో 12పుస్తకాలు, వందలాది వ్యాసాలు రాశారాయన. నిష్పాక్షిత దృష్టితో చరిత్రను, తత్వశాస్త్రాన్ని పరిశోధించిన బలరామమూర్తి నిజమైన శాస్త్రీయ చరిత్రకారుడు. ఆయన రచనలు సమకాలీన సమాజం మనుగడకు ఎంతగానో దోహదం చేస్తాయి.

 

ఏటూకూరు బలరామమూర్తి

శతజయంతి ప్రచురణ (1918–2018)

చరిత్ర, తత్వశాస్త్ర, సాహిత్య వ్యాస సంపుటం

ధర : 175రూపాయలు, పేజీలు 216

ప్రతులకు :నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌, గిరిప్రసాద్‌ భవన్‌, బండ్లగూడ రోడ్‌, నాగోల్‌, హైదరాబాద్‌–68