ఒక జాతి జీవన ఆత్మ

ఓ నిర్విరామ పథికుడు, సాహితీ పిపాసి సాగిస్తున్న ఏడు పదుల జీవన యానం తెలంగాణ సంస్కృతితో, స్థితిగతులతో జమిలిగా ఎలా ముందుకు సాగిందో ‘హైదరాబాద్‌ నుండి తెలంగాణ దాకా’ పుస్తకంలో ఆవిష్కృతమైంది. పదకొండు అధ్యాయాలతో మలిచిన ఈ గ్రంథం లక్ష్మణ్‌రావు పతంగే ఆత్మకథ మాత్రమే కాదు, అంతకుమించి అలనాటి హైదరాబాద్‌ రాజ్యం నుంచి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దాకా సాగినఒక జాతి జీవన ఆత్మ. ఎదురుగా కూర్చుని హాయిగా చెప్తున్నట్లు సాగే శైలి పాఠకున్ని చూపు మరల్చనివ్వదు.

- గోవిందరాజు చక్రధర్‌

హైదరాబాద్‌ నుండి తెలంగాణ దాకా

రచన: లక్ష్మణ్‌రావు పతం

గేపేజీలు: 288, వెల: రూ.200

ప్రతులకు : 92900 79047