తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభాపురస్కార గ్రహీత, సాహిత్య సాంస్కృతిక రంగాల్లో దిట్ట డా.మద్దాళి ఉషాగాయత్రి. దేశ విదేశాల్లో నాట్య ప్రదర్శనలతో పేరెన్నికగన్న నాట్యకారిణిగా, మరోవైపు రచయిత్రిగా రాణిస్తున్నారు. కూచిపూడి ఆర్ట్‌పై పరిశోధన చేసి పిహెచ్‌డి. పొందారు. ఇప్పటికే ఆమె రాసిన పలు పుస్తకాలు మార్కెట్లో ఉన్నాయి. 18కథలున్న ఆమె తాజా కథల సంపుటి ఈ ‘కడదాకా కలిసి’. ఇది ఆమె రెండో కథల సంపుటి. నిత్యజీవితంలో కుటుంబాల్లో ఎదురయ్యే సమస్యలన్నీ ఈ కథల్లో కనిపిస్తాయి. ఈ సంపుటిలో మకుటాయమానమైనది టైటిల్ కథ. అమ్మానాన్నలతో కూడి, కుటుంబాలు ఐక్యంగా వర్థిల్లాలని చాటిచెప్పే కథ ‘కడదాకా కలిసి’. మన కుటుంబాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థాల్లాలని కోరే కథలివన్నీ.
కడదాకా కలిసి
డా. మద్దాళి ఉషాగాయత్రి
ధర 100
పేజీలు 166
ప్రతులకు రచయిత్రి, సెల్ 99 890 41 777 మరియు అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు