నాట్యగురువు, నాట్య పరిశోధకురాలు, కథానవలా రచయిత్రి డా.మద్దాళి ఉషాగాయత్రి. దేశవిదేశాల్లో కూచిపూడి నాట్య ప్రతిభను ఇనుమడింపజేసిన కళాకారిణి. అంతకుమించి సంగీతంలో దిట్ట. బహుముఖ ప్రజ్ఞాశీలి ఉషాగాయత్రి రాసిన 18కథలున్న మరో సంపుటి ఈ పుస్తకం. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వాళ్ళతో ఉండలేక, అంతిమజీవితాన్ని ఒకేచోట హాయిగా గడపాలని నిర్ణయించుకున్న ఏకోదరుల కథ ‘కడదాకా కలిసి’. ఆత్మీయానుబంధాల్ని, కుటుంబ సంబంధాల్ని కళ్ళకు కట్టేకథలివన్నీ.
కడదాకా కలిసి
డా.మద్దాళి ఉషాగాయత్రి
ధర : 100రూపాయలు, పేజీలు 162
ప్రతులకు : రచయిత్రి, మద్దాళి గోల్డెన్ నెస్ట్,
బాగ్ అంబర్‌పేట, హైదరాబాద్–013 మరియు అన్ని ప్రముఖ పుస్తక విక్రయశాలలు