తెలుగుభాషాభివృద్ధికి జీవితాన్ని అంకితం చేసిన రచయిత, నిస్వార్థ జర్నలిస్టు, నంది అవార్డుల గ్రహీత కీ.శే. డా.వేదగిరి రాంబాబు. ఆయన సన్నిహితులు, స్నేహితులు ఆయన అనుభవాలను, జ్ఞాపకాలను పంచుకున్న స్ఫూర్తిపథమీ పుస్తకం. 23 జిల్లాల్లో కథానికా శతజయంతి ఉత్సవాలు, శ్రీపాద విగ్రహావిష్కరణ, పంచసప్తతి కథానికా సంకలనంతోపాటు 50కిపైగా పుస్తకాలకు సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించిన కథాజీవి రాంబాబు. 

400 కథలు, నాలుగు పరిశోధనాగ్రంథాలు, చరిత్ర గ్రంథాలు, బాలల గ్రంథాలు, వైద్య, ఆధ్యాత్మిక, జీవితరేఖ, విమర్శనాగ్రంథాల రచనలు చేసి తన సాహితీభూమికను విస్తరించారు. అనూహ్యమైన సాహిత్య కార్యక్రమాల బాధ్యతల్ని సొంతఖర్చుతో విజయవంతంగా పూర్తిచేసిన భాషాభిమాని. ఆయన కృషిని కళ్ళకుకట్టే అమూల్యమైన పుస్తకమిది. 

 

కథానికాజీవి డా.వేదగిరి రాంబాబు స్ఫూర్తిపథం
ధర అమూల్యం
పేజీలు 182
ప్రతులకు వేదగిరి కమ్యునికేషన్స్‌, భాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌–44 సెల్‌ 93 913 43 916