సామాజిక వాస్తవికతకు దగ్గరగా ఉండే 13 కథల సంకలనం ఈ ‘కూరాడు’ తెలంగాణకథ–2016. సమాజాన్ని దుర్భిణి వేసి చూస్తూ ప్రమాద ఘంటికలను హెచ్చరించే కథలివన్నీ. దళితకోణం, అధిపత్యవర్గాల అణచివేత, మైనార్టీల అభద్రత వంటి అంశాలతో భిన్న కోణాల్ని ఆవిష్కరించే మన్నె ఏలియా, కె.వి.నరేందర్‌, నిరంజన్‌, డా.పసునూరి రవీందర్‌, అఫ్సర్‌ కథలు, సింగరేణి బొగ్గుబావుల నేపథ్యంలో రామాచంద్రమౌళి, హనీఫ్‌ రాసిన కథలు సహా ఒకరిద్దరు మినహా ఇందులోని కథకులందరూ సీనియర్‌ రచయితలే. పెద్దింటి అశోక్‌కుమార్‌, వెల్దండి శ్రీధర్‌, సుదర్శన్‌, కిరణ్‌చర్ల, తాయమ్మకరు, చందు తులసి కథలిందులో ఉన్నాయి. 

 

కూరాడు
తెలంగాణ కథ 
సంపాదకులు సంగిశెట్టి శ్రీనివాస్‌, వెల్డండి శ్రీధర్‌
ధర 70 రూపాయలు పేజీలు 128
ప్రతులకు ప్రముఖ వొయ్యిల దుకాండ్లు, నవోదయ బుక్‌హౌస్‌, కాచిగూడ, హైదరాబాద్‌
సంగిశెట్టి శ్రీనివాస్‌, సెల్‌ 9849220321