అంపశయ్య నవీన్‌! ఆ పేరు ఒక్కటే చాలు, ఆయన గురించి తెలియడానికి. ‘రవిత్రయం’ నవలలతో పాపులారిటీ పొంది, ‘కాలరేఖలు’ తో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డునందుకున్న కథానవలా రచయిత అంపశయ్య నవీన్‌. ఈ తాజా పుస్తకం ‘కొత్త నీరొచ్చింది’ ఆయన వెలువరించిన ఏడవ కథా సంకలనం. 2016–18 మధ్యకాలంలో వివిధ పత్రికల్లో వచ్చిన ఆయన 14 కథలు ఇందులో ఉన్నాయి. స్వీయానుభవాలు, మిత్రులు చెప్పిన ఉదంతాలనే కథలుగా మలిచిన సంకలనమిది. సమకాలీన గ్రామీణ–పట్టణ సమాజాలలోని అనేక సమస్యలు, వ్యక్తుల మనస్తత్వాలు, ప్రతిస్పందనల్ని ఆవిష్కరిస్తాయీ కథలు. టైటిల్ కథ ‘కొత్త నీరొచ్చింది’ పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వచ్చిన సమస్యలను ప్రతిబింబిస్తుంది.

కొత్త నీరొచ్చింది

అంపశయ్య నవీన్‌ కథలు
ధర 200 రూపాయలు
పేజీలు 168
ప్రతులకు నవోదయ బుక్‌హౌస్‌, కాచిగూడ, హూదరాబాద్‌–01 నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌, నాగోల్‌, హైదరాబాద్‌–68 మరియు రచయిత, ఇ.నె.2–7–71, ఎక్సైజ్‌ కాలనీ, హనుమకొండ, వరంగల్‌–01 మొబైల్‌ 99 89 29 12 99