మనిషి చుట్టూ, అతని మనస్తత్వం చుట్టూ తిరిగితేనే ఏ కథ అయినా నాలుగు కాలాల పాటు నిలుస్తుంది. అలాంటి 18 కథల సమాహారమే ఈ సంపుటి. ప్రతి కథను దాటుకుంటూ వెళ్తున్నప్పుడల్లా మనల్ని మనం మానవత్వపు ఆకురాయికి రాసుకుంటాం. ‘మీల్స్‌ టికెట్‌’, ‘పరిష్వంగం’, ‘సోల్‌ మేట్‌’, ‘అలసితి’ లాంటి కథలు పాఠకుడిని పట్టి కుదిపేసి ఏదో సంస్కారాన్ని మనసుకు పూసి పోతాయి. ప్రతి కథ శిల్ప పరంగా కొత్త ప్రయోగంతో ఆకట్టుకునేదే. సన్నివేశ కల్పన, సంఘర్షణ ఆకట్టుకుంటాయి. చాలా సాధారణమైన ఎత్తుగడతో మొదలయ్యే కథ ఒక సరళ శిల్పంతో సాగిపోతుంది. పాత్రల సృష్టి ప్రత్యేకంగా మెచ్చుకోదగింది. మొత్తంగాకథా ప్రేమికులు మెచ్చే కథలు.

- డా. వెల్దండి శ్రీధర్‌

మీల్స్‌ టికెట్‌ (కథలు),

రచన: డా. ప్రభాకర్‌ జైని

పేజీలు: 185,

వెల: రూ. 200,

ప్రతులకు: 79898 25420