‘మిథునం’ తెరవెనక...
‘మిథునం’ మీద చెప్పడానికి ఇంకేం మిగిలింది? శ్రీరమణ రాసిన ఈ కథ ఇప్పటికే పలు సంకలనాల్లోనూ, బాపూ దస్తూరీతోనూ అలరించింది. తర్వాత తనికెళ్ల భరణి చొరవతో తెరకెక్కి అందరి ప్రశంసలూ పొందింది. ఇప్పుడు ఈ పుస్తకం రాకపోయి ఉంటే ‘మిథునం’ తెరవెనక భరణి పడ్డ శ్రమ లోకానికి తెలిసేది కాదు. మొదట్లో ఎల్‌.బి. శ్రీరామ్‌, మృణాళిని జంటగా రాబోయి ఆగిపోయిందనిగాని, ఆ తర్వాత బుచ్చిలక్ష్మి పాత్రకోసం సుహాసిని, రాధిక, రేఖ అనుకున్నారని, వారి వెతుకులాటలో ‘లక్ష్మి’కి అదృష్టం దక్కిందనిగాని, ‘మిథునం’ పై సినీ ప్రముఖుల అభిప్రాయాలు తెలిసేవి కాదు. 
మిథునం - ఒక పరిశీలన, సర్వమంగళ
పేజీలు : 84, వెల : రూ. 100/-
ప్రతులకు : హాస్యానందం, 8-215/4, యర్రబాలెం - 522503, గుంటూరు జిల్లా