మరాఠీ నేలలో తెలం‘గానం’

అంబల్ల జనార్దన్‌ పాత్రల హృదయాలను ప్రాంతాల ఆత్మలో మమేకం చేసే శైలితో చెబుతారు. ఆయన తాజా సంకలనం ‘ముంబాయి చూపుతో’ కథలు తెలంగాణ జీవన దృశ్యాలకు అక్షర రూపం. ఈ 46 కఽథానికల కల్పవృక్షం నిండా ఎన్నో మర్మాలు - ఎన్నో ధర్మాలు - మరెన్నో భావోద్వేగాలు. పుట్ట్టిన నేలకు దూరమైనా తల్లి భాషను మరచిపోలేదు ఆయన. జనార్దన్‌ వాక్యాలలోని మాండలికపు సొబగు ఇప్పటికీ తాజాగా పరిమళిస్తూనే ఉండటం గమనార్హం. ‘గమనం మార్చిన గాలి’, ‘స్వామివారి సేవ’, ‘చమురుదీపం’ లాంటి కథలు విధిగా చదవాల్సినవి. చెప్పే టెక్నిక్‌ ప్రతి కథకూ మారుతుంది. మహారాష్ట్ర ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో జనార్దన్‌ కథలను చేర్చడం తెలుగు సాహిత్యానికి పట్టం కట్టడమే. ‘ముంబాయి చూపుతో’కథల్ని మొదలుపెడితే సాంతం ఆపకుండా చదివేస్తాం!

- వల్లూరి రాఘవరావు

ముంబాయి చూపుతో... (కథలు),

రచన: డా. అంబల్ల జనార్దన్‌

పేజీలు : 286, వెల: రూ. 300,

ప్రతులకు : 88503 49858