పాఠకుడు అద్దంలో తనను తాను చూసుకున్నట్టుండే పుస్తకమిది. ప్రేమించడం తెలిసినవాడు ఏకాంతంగా గడపడు అంటాడు ఈ రచయిత విశ్వర్షి వాసిలి (వాసిలి వసంతకుమార్‌). తెలుగులో మొదటి ఆధ్యాత్మిక (మెటాఫిజికల్‌) దీర్ఘకావ్యం ఈ ‘నేను’. సైన్స్‌కు–పురాణభావనలకు మధ్య సాపత్యం కుదిర్చి రాసిన కవిత్వమిది. వాట్సాప్‌లో సాహితీమిత్రులు నడిపే ‘సాహితీ సిరికోన’ అను దిన సాహితీ సంచికలో రాసిన 220పేజీలుపైచిలుకుగల గ్రంథంలో ఎడిట్‌ చేసిన చిక్కటి సాంద్రతగల దీర్ఘకావ్యమిది. శక్తికీ, పదార్థానికీ గల సంయోగ, సారూప్య సహజస్థితుల వర్ణన ఈ పుస్తకం.

 

నేను 

యౌగిక కావ్యం

విశ్వావలోకనం

విశ్వర్షివాసిలి

ధర : 150రూపాయలు, పేజీలు : 152

ప్రతులకు : యోగాలయ, కృష్ణాఎన్‌క్లేవ్‌, 

తిరుమలగిరి, సికింద్రాబాద్‌–015 సెల్‌ 93 93 93 39 46