పాలెగాడి పోరాట పటిమ!
కుంఫిణీ ప్రభుత్వాన్ని ఎదిరించిన వీరుల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒకరు. ఆయన పోరాట గాథను యస్.డి.వి. అజీజ్ ‘పాలెగాడు’ పేరుతో ఆద్యంతం ఆసక్తికరంగా రచించారు. నరసింహారెడ్డికి గురువులాంటి గోసాయి వెంకన్న, నీడలాగా పనిచేసిన ఓబయ్యతో పాటు, ఆయన సిద్ధాంతాలతో ఏకీభవించి, పనిచేసిన వ్యక్తుల గురించి ఇందులో చాలా చక్కగా వివరించారు. నరసింహారెడ్డిని హతమార్చడంలో కీలక పాత్ర వహించిన కుంఫిణీ ప్రభుత్వాధికారులు, ఆయన సోదరుడు మల్లారెడ్డి స్వభావాలను కళ్లకు కట్టారు. అహోబిలం నరసింహస్వామిని, మారెమ్మకుంటలో కొలువైన మారెమ్మ తల్లిని, ఆనాడు ఆచారంలో ఉన్న కోళ్ళ పందేలు, నాగుల చవితి పూజలు, ప్రజల్లోని మంచీచెడులు, పల్లె పదాలు, జానపద కళల గురించి కూడా సందర్భోచితంగా రాయడం ప్రశంసనీయం.
- డా. చల్లా భాగ్యలక్ష్మి
పాలెగాడు
- యస్.డి.వి.అజీజ్
పేజీలు: 149
వెల: రూ.120
ప్రతులకు: విశాలాంధ్ర