భాగవత సారం

పోతనామాత్యుడు తెనిగించిన మహాభాగవతంలోని మొదటి ఏడు స్కంధాలలోని ఆసక్తికరమైన అంశాలను ఎంపిక చేసుకుని రాసిన పుస్తకమిది. భాగవత ప్రాశస్త్యాన్ని తెలియడం మొదలుకుని-కుంతీ, భీష్మ, ధ్రువ, ప్రహ్లాదాదుల భక్తి తత్పరత, సృష్టి క్రమం, యజ్ఞ వరాహమూర్తిఆవిర్భావం, కపిల బోధలు, దక్ష యజ్ఞం, అజామిళ,ప్రియవ్రత, పృథు, జడ భరతాదుల వృత్తాంతాల వంటి రసవద్ఘట్టాల గురించి చక్కటి శైలిలో విశ్లేషిస్తూ - శ్రీ రామకృష్ణ పరమహంస, భగవాన్‌ రమణ మహర్షుల వంటి మహాత్ముల తాత్త్విక కోణంలోంచి భగవత్తత్త్వాన్ని వివరించడం ప్రత్యేకత.

- ఓలేటి శ్రీనివాసభాను

పలికెడిది భాగవతం,

వ్యాఖ్యాత: స్వామి జ్ఞానానంద

సహకారం: బి. సైదులు,

పేజీలు: 260, వెల: రూ. 70

ప్రతులకు: రామకృష్ణ మఠం, దోమలగూడ, హైదరాబాద్‌-29